11-06-2024 RJ
తెలంగాణ
వేములవాడ, జూన్ 11: దైవ దర్శనానికి వెళ్లి ఓ భక్తుడు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర సంఘటన వేములవాడలో చోటు చేసుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు జనగామ జిల్లాకు చెందిన బొట్ల వినయ్ కుమార్ ఆలయానికి చేరుకున్నారు. రాజన్న దర్శనం అనంతరం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే మార్గ మధ్యలో గుండెపోటు వచ్చింది.
అప్రమత్తమైన కుటుంబీకులు ఏరియా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వినయ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.