12-06-2024
తెలంగాణ
ఖమ్మం, జూన్ 12: ఖమ్మంలో పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బుధవారం ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారాయన. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులతో ఆయన మమేకం అవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి మహిళలతో నేరుగా మాట్లాడారు. బస్సులో జగన్నాధపురం గ్రామం వద్ద భట్టి విక్రమార్క దిగిపోయారు. గ్రామాలకు బస్సు రవాణా సౌకర్యం, మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భట్టి ఈ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. భట్టి విక్రమార్కతో పాటుగా ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.