13-06-2024 RJ
సినీ స్క్రీన్
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి ’డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. దేవర’ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని టాక్. ఈలోగా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే పనిలో పడింది చిత్రబృందం. కథానాయికగా రష్మిక ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రతినాయుడి పాత్రకు బాలీవుడ్ నటులను తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతానికి సీనియర్ నటుడు బాబీ డియోల్‌తో దర్శక నిర్మాతలు మాట్లాడుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం బాబీ డియోల్ సౌత్ ఇండియన్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ’హరి హర వీరమల్లు’ సినిమాలో ఔరంగజేబ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ’డ్రాగన్’ కూడా ఒప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పారితోషికం, డేట్లు అన్నీ సర్దుబాటు అయితే బాబీ డియోల్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసినట్టే. ఎన్టీఆర్ ప్రస్తుతం ’దేవర’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల గోవాలో ఓ కీలకమైన షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు.