13-06-2024 RJ
తెలంగాణ
మెదక్, జూన్ 13: మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారని అన్నారు. ఇప్పుడే ఆ కేసు నమోదైందని అన్నారు. అనంతరం కేసీఆర్‌ను విచారణ చేసేందుకు ఈడీ అధికారులు కూడా వచ్చినట్లు చెప్పారు. గొర్రెల కొనుగోలు వ్యవహారంలో ఈడీ ఈ కేసు నమోదు చేసిందని వ్యాఖ్యలు చేశారు. మెదక్ పట్టణ కేంద్రంలో జరిగిన దిల్ సే ములాఖాత్ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం హవెలి ఘన్పూర్ మండలం ముత్తాయిపల్లి శివాలయంలో కూచానపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రఘునందన్ రావు పూజలు చేశారు. తర్వాత మెదక్ పట్టణంలో పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు.