13-06-2024 RJ
తెలంగాణ
మంచిర్యాల, జూన్ 13: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలీ ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా ఒక్కసారిగా కంపౌండ్ వాల్ కూలీపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెండు మృతదేహాలను వెలికి తీయగా మరో మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులు కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.