ad1
ad1
Card image cap
Tags  

  14-06-2024       RJ

రాష్ట్రంలో ముమ్మరంగా వ్యవసాయ పనులు

తెలంగాణ

  • పలుచోట్ల ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు
  • మరిన్ని వర్షాలు పడితే జోరుగా నాట్లకు అవకాశం

నిజామాబాద్, జూన్‌ 14: ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇంకా ఎండాకాలం కొనసాగుతున్నట్లుగా ఉంది. అడపాదడపా వర్షాలు పడుతున్నా పూర్తిస్థాయిలో వర్షాలు ఇంకా ప్రారంభం కాలేదు. తొలకరి సకాలంలో వచ్చినా విస్తృతంగా వర్షాలు పడడంలేదు. దీంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సిద్దంగా ఉన్నారు. కొన్నిచోట్ల పత్తి నాటుకున్నారు. తొలకరి వర్షాలతో విత్తనాలు మొలకెత్తాల్సిన సమయమిది. మృగశిర కార్తె ప్రారంభంలోనే వర్షాలు కురియడం ఆనవాయితీ. అప్పుడే విత్తనాలు వేస్తారు. దుక్కులు దున్ని చాలా మంది రైతులు విత్తనాలు నాటుకునేందుకు సమాయత్తం అవుతున్నా తరుణంలో వర్షాలు మరింతగా పడాలని చూస్తున్నారు. కాల్వలు, ప్రాజెక్టుల్లోకి అప్పుడే నీరు చేరడం లేదు. చాలాచోట్ల  ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట అయిన పత్తి పంటనే సాగు చేస్తారు.

వర్షాకాలం ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఖరీఫ్‌కు సిద్ధమయ్యారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి పథకం,బీమా పథకం అమలు చేయడం, పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి పథకాలు పక్కాగా అమలయితే దేశంలో కరువు కాటకాలు ఉండవంటున్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడరని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుని, అమలు చేసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు  పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతుంటే బిఆర్‌ఎస్‌ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విత్తనాలు, ఎరువులు ముందుగానే స్టాక్‌ పెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నమని పేర్కొన్నారు.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని జూన్‌ మొదటి వారంలోనే తాకాయి. ఈ సారి రుతుపవనాలు త్వరగానే వచ్చాయి. ఈసారి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌లో నెలలో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదు కానుందని తెలిపింది. వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్టోగ్రలకు కాస్త తగ్గాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాకతో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. ఉరుములు, మెరుపుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP