14-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 14: హైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందుగా కస్టమర్‌లను సంప్రదించడం జరుగుతుంది. అనంతరం కస్టమర్‌ల డేటా బేస్‌ను తయారుచేసి.. వారు కోరుకున్న ప్రదేశంలో మహిళలు వారిని కలుసుకునేలా ఏర్పాటు చేస్తారు. కస్టమర్‌కు అనుకూలంగా ఉన్న లాడ్జ్‌ను బుక్ చేస్తారు. ఓ మహిళ కస్టమర్‌లతో లావాదేవీలు జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అనేక మారు పేర్లతో సదరు మహిళ కస్టమర్లను ఆకర్షిస్తోందని తెలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాగుట్ట పీఎస్ పరిధిలోని పార్క్ హోటల్‌లోని ఓ గదిపై దాడి చేసి బాధితురాలితో పాటు నిందితుడు కీర్తితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితులు నివాసముంటున్న వివిధ ప్రదేశాలపై దాడి చేసి, పైన పేర్కొన్న ప్రధాన నిర్వాహకులు.. సబ్`ఆర్గనైజర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 89,500 నగదు, రెండు కార్లు, రెండు బైక్స్, 18 సెల్‌ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, వివిధ బ్యాంకుల డెబిట్/క్రెడిట్ కార్డ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.