14-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, జూన్ 14: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. మృతులను కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన గండి ధర్మవర ప్రసాద్ (27), అమలాపురానికి చెందిన పేసింగు కనకరాజు (34), కాట్రేనికోనకు చెందిన చింతా లోవరాజు (32), మాగపు సోమరాజు (30), ఎస్ యానాంకు చెందిన రేవు నాగభూషణం (26), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ (42)గా గుర్తించారు.
ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్‌తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. కంటైనర్‌లో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారు. కర్రల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడిరచారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడో లేదంటే మరో కారణమో కానీ జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొట్టాడు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా తాళ్లరేవు వాసులుగా గుర్తించడం జరిగింది.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులు ఒకొక్కరికి రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు.
ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని ఈ రోజు సాయంత్రం లోపు అందజేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హావిూ ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.