14-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 14: అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ డిప్యూటి సిఎంగా తను కోరుకున్న పంచాయతీరాజ్, గ్రావిూణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను సాధించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో నూతనంగా ఎన్నుకోబడిన కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఏయే శాఖకు ఎవరెవరు మంత్రి అనే విషయాన్ని శుక్రవారం వరకు ప్రకటించలేదు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు తిరుపతిలో తన మొక్కులు తీర్చుకుని, గురువారం సాయంత్రం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు అంటే శుక్రవారం.. కేబినెట్ మినిస్టర్స్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రావిూణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే విషయాన్ని చంద్రబాబు ప్రకటించక ముందే కేంద్ర మంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి సోషల్ విూడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా పవన్ కళ్యాణె అనేలా సోషల్ విూడియాలో భారీ స్థాయిలో ప్రచారం జరిగినా.. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రావిూణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా నియమిస్తూ అధికారికంగా విడుదల చేసిన జాబితాలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ శాఖలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ప్రకటనతో ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, అభిమానులు సోషల్ విూడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.