ad1
ad1
Card image cap
Tags  

  15-06-2024       RJ

ఎర్రచందనం దొంగలను అరికడతాం.. ఎంతటి వారైనా ఉపేక్షించం

ఆంధ్రప్రదేశ్

  • అటవీ దొంగలు నుండి అడవులను, పర్యవారణాన్ని కాపాడుతాం
  • ఎంతటి వారైనా కటకటాల్లోకి తోసేస్తాం
  • ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి
  • మీడియాతో డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌

అమరావతి, జూన్‌ 15: ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్దాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు.

శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా తాను భావిస్తున్నానని అన్నారు. శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ... 2014 నుంచి తాను రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనల సందర్భంగా అనేక కష్టాలు కన్నీళ్లు చూశానని చెప్పారు. ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలు తనకు ఆవేదన కలిగించాయన్నారు. ఉపాధి హావిూ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రావిూణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్లలెలకు రక్షిత తాగునీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తానని హావిూ ఇచ్చారు.

పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్దాంతాల్లో ఒకటి అని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలని కోరుకున్నారు. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరమని చెప్పుకొచ్చారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేమని అన్నారు. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్లడానికి చేయూతనిస్తామన్నారు. భూతాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తామని వివరించారు.

గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి తన మదిలో ఎప్పుడూ మార్మోగు తుంటుందన్నారు. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అలాంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతామని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్దాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కీలక శాఖలు కేటాయించి నందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

ఉపాధి హావిూ నిధుల సద్వినియోగం, గ్రావిూణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్‌ వెల్లడిరచారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడి, పచ్చదనాన్ని పెంచుతామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌కు ప్రజా ప్రయోజన శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల పవన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తామన్నారు. సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పుతామని వివరించారు. సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంతోపాటు ఆ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తానని పవన్‌ కల్యాణ్‌ హావిూ ఇచ్చారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP