15-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 15: వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వీటితో పాటుగా193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్‌సీల్లోని డిమాండ్‌కు అనుగుణంగా సర్జన్లను నియమించనున్నారు.