15-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అన్నవరం, జూన్ 15: రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సత్య దేవుడిని దర్శించుకున్నారు శనివారం మధ్యాహ్నం హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా రత్నగిరి కొండపైకి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం ఈవో కె.రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనితకు వేద ఆశీస్సులు నిర్వహించి స్వామివారి జ్ఞాపికను అమ్మవారి పట్టు వస్త్రాలను ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ మంత్రి అనితను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో మండల, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.