17-06-2024 RJ
తెలంగాణ
నిర్మల్, జూన్ 17: నిరుద్యోగ యువతను బిజెపి నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూతపడ్డ పలు సంస్థల పునరుద్ధరణ కోసం నోరుమెదపని వారికి రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. ఉద్యోగాలు లేక యువత ఎంత బాధ పడుతున్నారో తెలుసు కోవాలని అన్నారు. సీసీఐ సహా అన్ని సంస్థలను వెంటనే తెరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో దీనిపై పోరాడాలని అన్నారు. కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌కు అమ్మేసిందని, దీంతో వేల మంది రోడ్డున పడ్డారని చెప్పారు. ఇప్పుడు ఎల్‌ఐసీ సహా అనేక కంపెనీల వాటాలను అమ్మకానికి పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వివాక స్టీల్‌పై త్వరగా తేల్చాలని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నదని వెల్లడిరచారు. విచ్చలవిడిగా ప్రభుత్వరంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు.
ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇదిలావుంటే ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాల కోరారు. దీంతో గ్రామాల్లో ఉపాధి కూలీలకు నిరంతరాయంగా పనులు దక్కుతాయన్నారు. అలాగే వ్యవసాయ పనులు కూడా చురుకుగా సాగుతాయన్నారు. ఉత్తుత్తి పనులకు ఇక చెక్ పడగలదన్నారు. వ్యవసాయ రంగంలో కూలీలు దొరక్క రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి హావిూ పథకం కూలీలను వ్యవసాయ రంగం వైపు మళ్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. 25శాతం చెల్లింపులు, ప్రభుత్వం 75శాతం చెల్లింపులు జరిపేలా ఒక విధానాన్ని తీసుకువస్తే వ్యవసాయం ఎంతో లాభదాయకం అవుతుందన్నారు.
కౌలురైతులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అందించాలన్నారు. రైతులు వ్యాపారులుగా ఆలోచించాలన్నారు. ఇందుకు గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తుల రూపాంతరానికి చిన్నచిన్న యూనిట్ల ఏర్పాటుకు రైతులు కృషి చేయాలన్నారు. ఇజ్రాయిల్, వియత్నం వంటి దేశాల్లో పద్ధతులు ఇక్కడ రైతులు అవలంభించాలన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయమే లాభదాయకమని ఆ దిశగా రైతులు చర్యలు చేపట్టాలన్నారు. గోవుల మూత్రంతో జీవామృతం తయారు చేసుకుని పంటలు పండిరచుకోవాలన్నారు.