17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, జూన్ 17: అందరూ సంతోషంగా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. శుభాలనే అనుభవించాలి. ఎవ్వరూ బాధపడకూడదు. ఇదీ శాంతి మంత్ర సారం. సామాజిక న్యాయ సూత్రం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం న్యాయేన్ మార్గేణ మహీం మహిశాః గోబ్రాహ్మణెళిభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినోభవన్తు ఓం శాంతిః శాంతిః శాంతిఃప్రజల క్షేమంగా ఉండాలి. పాలకులు సన్మార్గంలో పరిపాలించాలి. గోవులకు, వేదపండితులకు శుభం కలగాలి. జీవులన్నీ సంతోషంగా ఉండాలి` ఇదీ మంత్ర సారం. ఈ శాంతి కాంక్ష మరేదో కాదు, సామాజిక న్యాయమే. వ్యసనపరుడికి తాత్కాలికంగా లభించే ఆనందం, సుఖమే నచ్చుతాయి. అందుకే వ్యసనపరులు వ్యసనపరులతోనే సహవాసం చేస్తారు. మంచివాళ్లు చెప్పే మాటలు వారి చెవులకు శూలాల్లా గుచ్చుకొంటాయి.
గాడిదకు గంధం వాసన తెలియనట్లు, పందికి పరమాన్నపు రుచి తెలియనట్లే` వ్యసనపరుడికి హితవచన మహిమ తెలియదు. మనిషి బాగుపడాలంటే పెద్దలపట్ల భయమైనా ఉండాలి, లేదా మంచి విషయాలపై భక్తి అయినా ఉండాలి. భయం కాని, భక్తి కాని లేని మనిషి తెగిన గాలిపటంలా ఎక్కడ పతనమవుతాడో ఎవరికీ తెలియదు. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా, మనిషి అధోగతిపాలైన తరవాత జ్ఞానోదయమైనా చేయగలిగిందేవిూ ఉండదు. మనిషికి భాగ్యదాయక క్షణాలు ఎప్పుడో కానీ రావు. అలా వచ్చినవాటిని చక్కగా ఉపయోగించు కొనేవాడికి జీవితం ఆనంద బృందావనం అవుతుంది.