17-06-2024 RJ
తెలంగాణ
మెదక్, జూన్ 17: ఆన్లైన్ బెట్టింగ్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా నష్టపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెద్క్ జిల్లా రామాయంపేటలో జరిగింది. మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట భానుప్రసాద్ (24) అనే యువకుడు గత కొన్నిరోజులుగా ఆన్లైన్లో గేమ్‌లు ఆడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడిన భాను ప్రసాద్ రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. పైగా తెలిసిన వారి వద్ద అప్పులు కూడా చేశాడు. పెట్టిన డబ్బులన్నీ పోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఐదురోజుల క్రితం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే రామాయంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.