17-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గత మూడురోజులుగా ఉకకపోత, ఎండలతో ఉన్నజనానికి ఊరటనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృత్తమే భారీ వాన కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కొత్తపేట, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట, సంతోష్ నగర్, ఐస్ సదన్, ఉప్పల్, కాప్రా, మేడ్చల్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అవిూర్‌పేటలో భారీ వర్షం పడుతోంది. ఫిలింనగర్‌లో అత్యదికంగా వర్షం పడింది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ అలర్ట్ అయింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ బల్దియా సూచించింది.. రాగల గంటపాటు నగరవ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది.ఈదురుగాలుల కారణంగా టోలిచౌకీ, గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏళ్ల నాటి వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలు కాగా.. నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.