17-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై ఓ మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను కాపాడారు. నిద్రమాత్రలు మింగి కేబుల్ బ్రిడ్జ్ ఫుట్ పాత్ పై ఆ మహిళ పడిపోయింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను గుర్తించారు. స్లీపింగ్ ట్యాబెట్లు తీసుకుందని తెలిసి.. వెంటనే చికిత్స కోసం కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు మహిళ వివరాల గురించి ఆరాతీసున్నారు.
గతంలో కూడా చాలామంది ఇక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించారు. అంతేకాదు వంతెనపై వాహనాలు ఆపి ఫొటోలు దిగటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగుతుందని.. ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కేబుల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ ఆంక్షలను అమలుచేస్తున్నారు. వంతెనపై వాహనాలు ఆపినవారిపై పోలీసులు కఠికంగా వ్యవహరిస్తున్నారు.