ad1
ad1
Card image cap
Tags  

  17-06-2024       RJ

పోలవరంను సర్వనాశనం చేసిన జగన్‌

ఆంధ్రప్రదేశ్

  • రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు
  • కలల ప్రాజెక్టును పూర్తిగా దెబ్బతీసారు
  • వేలకోట్లు వృధా చేసిన నాటి పాలకుడు
  • గట్టిగా కష్టపడితే మరో నాలుగేళ్లు పడుతుంది
  • పోలవరంపై అధికారులతో సవిూక్షించిన చంద్రబాబు

పోలవరం, జూన్‌ 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తెదేపా హయాంలోనే 72 శాతం ప్రాజెక్టును పూర్తి చేశాం. రూ. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్‌ వేపై డిశ్చార్జ్‌ అవుతాయని అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో సవిూక్ష నిర్వహించారు. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనుల పురోగతి వివరాలను జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత విూడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్‌ వాల్‌ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్‌ క్షమించరాని తప్పులు చేశారు. ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సవిూక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగి ఉంటే 2020 చివరినాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని అన్నారు. ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేస్‌ స్టడీ. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.

అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది. నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది. అలా మార్చితే ప్రాజెక్టుకు జవాబుదారీ తనం ఉండదని చెప్పారు. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు?. ప్రజలనే కాదు, విూడియాను, ప్రతిపక్ష నేతగా నన్ను కూడా ఇక్కడికి రానీయలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు అంతా క్లిష్టంగా మారిపోయింది. ఈ చిక్కుముడులు అన్నీ విప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని కలలు కన్నా. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చెందిన ప్రాజెక్టు ఇదని చంద్రబాబు అన్నారు. ఇక డ్యామ్‌ ఎత్తు 45.72 విూటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును తగ్గించడానికి ప్రయత్నించారని చంద్రబాబు అన్నారు. స్పిల్‌ వే ద్వారా 50 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్లేలా డిజైన్‌ చేశామని, చైనాలో త్రీ గార్జియస్‌ ప్రాజెక్టు ద్వారా మాత్రమే అంత ఎక్కువ వాటర్‌ డిశ్ఛార్జి అవుతోందని పేర్కొన్నారు.

రాజకీయాల్లో ఉండ తగని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఆయన రావడం తప్పు కాదు. క్షమించరాని నేరం. అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడమే రివర్స్‌ టెండరింగ్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే కాంట్రాక్టు ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రం వాల్‌ 35 శాతం పాడయ్యింది. రూ.480 కోట్లతో అత్యవసరంగా నిర్మిస్తే దానిని అలా చేశారు‘ అని వివరించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని సీఎం చంద్రబాబు వివరించారు. కొంతమేర కాపర్‌ డ్యాం కట్టకపోవడంతో వరద తాకిడికి డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని వివరించారు. దెబ్బతిన్న దానికి సమాంతరంగా మరోటి నిర్మిస్తే రూ.447 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం అంతా కట్టాలంటే రూ.990 కోట్లు అవుతుందని చెప్పారు.

రెండు కాపర్‌ డ్యామ్‌లను రూ.550 కోట్లతో నిర్మించారని పేర్కొన్నారు. రూ.2 వేల కోట్లు కాపర్‌ డ్యాం గ్యాప్‌ నిర్మాణానికి అవుతుందని, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్ల సమయం పడుతుందని చెబుతున్నారని తెలిపారు. కాపర్‌ డ్యాం సీపేజీలు ఉన్నాయి.. వరదలు వస్తే మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత నష్టం చేయాలో అంత నష్టం ప్రాజెక్టుకు చేకూర్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏడాదికి సరాసరిన రూ.13,683 కోట్లు ఖర్చు చేశామని, పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలు లేవు.. కేస్‌ స్టడీగా అందరికీ తెలియాలి చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని, ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇక రివర్స్‌ టెండరింగ్‌ ఏమిటీ? అని చంద్రబాబు ప్రశ్నించారు.

కాపర్‌ డ్యాం గ్యాప్‌లు నింపే సమయంలోనే కాంట్రాక్టర్‌ను మార్చేశారని, పోలవరం ప్రాజెక్టు గురించి ఏవిూ తెలియకపోవడం అతని ఇజం, మూర్ఖత్వం అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ సరిగ్గా అమలు చేయకుండా ప్రాజెక్టుని మరింత క్లిష్టంగా మార్చారని మండిపడ్డారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదని, అందుకే అతడికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP