17-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 17: తెలంగాణలో రెండు రోజుల కిందట భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. పలు జిల్లాల ఎస్పీలు సహా ఏకంగా 28 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా రుత్‌రాజ్, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు, సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్, జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకీ ధరావత్, మంచిర్యాల డీసీపీగా భాస్కర్, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయుడును డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు.