17-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, జూన్ 17: కేంద్రమంత్రి పదవిని అలంకరించినా తన స్వభావంలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. మోదీ క్యాబినెట్‌లో కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు, చంద్రబాబు మంత్రివర్గంలో అచ్చెన్నాయుడుకు చోటు దక్కిన నేపథ్యంలో శ్రీకాకుళంలో వారికి ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘సిక్కోలు ప్రజల కల నిజమైంది. ఇది సిక్కోలు ప్రజల విజయం. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను. కేంద్రమంత్రి అయినా నా స్వభావం మారదు. కష్టనష్టాల్లో ఈ జిల్లా ప్రజలు నాకు అండగా ఉన్నారు. రాష్టాన్రికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తాను అని అన్నారు.