17-06-2024 RJ
సినీ స్క్రీన్
జూ.ఎన్టీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ’దేవర’ సినిమా కీలక షెడ్యూల్‌ను గోవాలో పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం తాజా షెడ్యూల్ కోసం థాయిలాండ్ పయనమయ్యారు. అక్కడ ఓ పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. ఆయనతోపాటు భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు కూడా వెళ్లారు. ఆదివారం సాయంత్రం కథానాయిక జాన్వీకపూర్ కూడా థాయ్‌ల్యాండ్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.
అయితే షూటింగ్‌తో పాటు తన కుటుంబంతో సరదాగా గడపడానికి కూడా ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సరైన హిట్ కోసం కొరటాలశివ శాయశక్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతీ మరాఠే, ప్రకాశరాజ్, మురళీశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.