ad1
ad1
Card image cap
Tags  

  18-06-2024       RJ

అసలు రైతులను గుర్తించే పనిలో ప్రభుత్వం

తెలంగాణ

  • పెద్దుల, పెత్తందార్లు, అధికారుల భూములకు నో
  • రుణమాఫీకి ముందే లెక్కతేల్చనున్న సర్వే

హైదరాబాద్‌, జూన్‌ 18: రైతుభరోసా మాదిరే రుతు రుణమాఫీకి కూడా విధివిధానాలు రాబోతున్నాయి. ఇందుకు పేదరికమే గీటురాయి కానుంది. అసలుసిసలు రైతులను గుర్తించబోతున్నారు. మోతుబరి రైతుల రుణాలను లెక్కలోకి తీసుకోవద్దన్న సూచనలు వచ్చాయి. దీంతో కేవతం వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్న బక్కరైతులకే లబ్ది చేరూర్చేలా రుణమాఫీని చేయబోతునట్లు సమాచారం. ’పీఎం కిసాన్‌’ పథకంలో ఉన్న నిబంధనలనూ రుణమాఫీలో అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.దీని ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రావిూణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, మిగతా చిన్న ఉద్యోగస్తులు కూడా వివిధ అవసరాల నిమిత్తం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారన్న అంశం తెరవిూదకు వచ్చింది.

రిటర్నులు దాఖలు చేశారన్న కారణంతో ఆ రైతులను మాఫీ నుంచి మినహాయించే అవకాశాలు లేవని, ఆదాయ పన్ను కడుతున్న వారినే మినహాయించే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఆ మేరకు ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్న చిన్న రైతులకు, చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం చేయాలనేదానిపై 4రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ పక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తం 3 విడతల్లో ఈ పక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సవిూకరణ కొలిక్కివస్తుండటంతో.. అన్నదాతలకు హావిూనిచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా.. ఒక నెల ముందుగానే పక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పీఎం కిసాన్‌లో అమలుచేస్తున్న నిబంధనలను రుణమాఫీకి కూడా వర్తింపజేసినా ఈ పథకం కోసం రూ.25వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రుణమాఫీకి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్‌బుక్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డులతో పాటు బ్యాంకుల ఖాతాలను ప్రామాణికంగా తీసుకుంటారు.

అదే విధంగా ఈ పక్రియ మొత్తం పూర్తయ్యేవరకు రైతులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు వీలుగా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ క్రమంలో అసలు రైతులను కూడా గుర్తించి రికార్డులు నమోదు చేయనున్నారు. రుణాలను తీసుకుని ఏయే పంటలు వేశారన్నది కూడా లెక్కలోకి రానుంది.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP