ad1
ad1
Card image cap
Tags  

  18-06-2024       RJ

తిరుమల పవిత్రతో పాటు ఆధ్యాత్మికత

ఆంధ్రప్రదేశ్

  • మళ్లీ పాతపద్దతిలో సమూల మార్పులకు కసరత్తు

తిరుమల, జూన్‌ 18: కేవలం వ్యాపారసూత్రంతో గత ఐదేళ్లుగా సాగిన తిరుమ వ్యవహారాలను ఇక పూర్తి ఆధ్యాత్మికత కొనసాగించేందుకు కసరత్తు మొదలయ్యింది. ఇవో నియామకంతో మెల్లగా అటువైపు సిఎం చంద్రబాబు దృష్టి సారించారు. టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక నుంచి కొండపై వసతులు, దర్శనం అన్నీ ఆధ్యాత్మికతను జోడిరచేలా ఉండబోతున్నాని తెలుస్తోంది.  అవకాశం ఉన్న చోట మార్పులు చేపట్టి, శ్రీవారి దర్శనం భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని టీడీపీ భావిస్తోంది. కొత్త ఈవో శ్యామల రావు లక్ష్యం ఇదేనని కూడా స్పష్టం అవుతోంది. టీటీడీలో ప్రక్షాళన షురూ అంటున్న ప్రభుత్వం ముందు సమస్యలు, సవాళ్లు ఏంటన్న దానిపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయంలో అమలైన విధానాలను కొనసాగించాలా వద్దా అన్నదానిపై ఫోకస్‌ పెట్టింది. వీఐపీ బ్రేక్‌ దర్శనం విషయంలో పాత విధానం అమలుకే మొగ్గు చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనం కొనసాగుతోంది. ఈ విధానంతో శ్రీవారి సర్వదర్శనం చేసుకునే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. దీంతో పాత విధానం మేలని శ్రీవారి నైవేద్య సమయంలోపే విఐపి బ్రేక్‌ దర్శనాలను ముగించాలని టీటీడీ భావిస్తోంది. మరోవైపు సామాన్య భక్తులు వసతి గదులు పొందేలా చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. అందుబాటులో ఉన్న 7800 అతిథి గృహాలతో పాటు పిలిగ్రీం ఎమ్యూనిటీ సెంటర్లను అందుబాటులో తీసుకురావాలని ఆలోచిస్తోంది. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. అన్న ప్రసాదం, లడ్డూల నాణ్యత, తిరుమలలో పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అంశాలను టాప్‌ ప్రియారిటీ గా తీసుకుంది.మొదటి రోజు నుంచే ప్రక్షాళన ప్రారంభమైంతా.

పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదు. తిరుమలలో గోవింద నామస్మరణనే మార్మోగాలి.. ఇవీ.. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సాకారం కాబోతున్నాయి.  అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. టీటీడీ ఈఓ బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావుకు అప్పగించింది. శ్యామలరావు సైతం వెంటనే రంగంలోకి దిగారు. ముందు తిరుమలలో వరాహస్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈఓగా బాధ్యతలు తీసుకున్న శ్యామల రావు తన ముందున్న లక్ష్యాలు, సవాళ్లను వివరించారు. తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది, ఇలాంటి క్షేత్రానికి ఈఓగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తామన్న ఈఓ.. ప్రతీ విషయం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండేలా చూస్తామంటున్నారు. ఈఓగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే తిరుమలలో తనిఖీలు చేపట్టారు. సమూల మార్పులు లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈఓ సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించారు. నందకం గెస్ట్‌ హౌస్‌ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్ల వరకు నడిచి వెళ్తూ భక్తులతో మాట్లాడారు. భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఈఓ ఇద్దరు శానిటరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP