18-06-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, జూన్ 18: బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని గుర్తుచేశారు. జంక్షన్ల పేరుతో అంచనాలు పెంచారని వివరించారు. గతంలో జరిగిన తప్పుల గురించి ఆరా తీస్తున్నామని వెల్లడిరచారు. విజిలెన్స్ విచారణ జరుగుతోందని.. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి హెచ్చరించారు. తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో మరొకరు తప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తుందని వివరించారు. కరీంనగర్ అభివృద్ధి తమకు ముఖ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డెవపల్ మెంట్ విషయంలో రాజకీయాలకు తావులేదని తేల్చి చెప్పారు.
కరీంనగర్ మున్సిపాలిటీ పై సవిూక్షా సమావేశం జరిగింది.. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లను నివేదిక తెప్పించుకోవాలని కోరడం జరిగింది.. ఇంజనీరింగ్ విభాగం ,సిఎం అసురెన్స్ ద్వారా 80 పనుల్లో జరిగినటువంటి పనులకు సంబంధించినవి, ఇంకా ప్రారంభం కానీ పనులు ఒకటే పని కింద 37 కోట్ల ప్రతిపాదన చేసినటువంటి పనుల పై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై ఎగ్స్క్యూటివ్ ఇంజనీర్ స్థాయి నుండి ఆబ్జర్వ్ చేయాలని చెప్పడం జరిగింది.. స్మార్ట్ సిటీ లో భాగంగా అనేక అంశాలు ఉన్నాయి..పట్టణంలో 22 వ్గైª హాట్ స్పాట్ లు ఉన్నాయి అవి ప్రజలకు తెలిసేల్ చేయాలన్నారు. టెక్నాలజీ కాంపోనెంట్ కింద 98 కోట్లతో కమాండ్ కంట్రోల్ నుండి 700 సీసీ కెమెరాలు పెట్టడం ,ఆడియోసౌండ్ సిస్టం, టెలివిజన్ ప్రసంటేశన్ ,సెన్సిటివ్ ప్రాంతాల్లో అలారం లాంటి ఏర్పాటు కోసం కేటాయించడం జరిగింది.. సాంకేతికంగా భవిష్యత్ లో ప్రజలు ఉపగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరైనా పేదల భూమిని ఆక్రమించి ఉంటే స్వేచ్చగా పిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పాం.. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం అక్రమ దారులు ఎవరున్నా చర్యలు ఉంటాయి .అందులో రాజకీయ జోక్యం ఉండకుండా వాతావరణం క్రియేట్ చేశాం..దాని ఫలితాలు కూడా చూశాం..ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారిక అధికారిక దుర్వినియోగం ద్వారా పర్మిషన్ తీసుకుని భవనాలు నిర్మించిన వారి వివరాలు తీసుకోవాలని చెప్పాం.. రెవెన్యూ శాఖ తరుపున ఆర్డీవో గారు ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించిన వారి వివరాలు తీసుకోవాలని చెప్పాం.. సాంకేతిక పరమైన భూమి ప్రభుత్వం అని చెప్పేలా సర్టిఫికెట్ తీసుకొని తరువాత చర్యలు తీసుకోవాలి.. అనుమతులు లేని భవన నిర్మాణాల పై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వం తరుపున జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు.. ఇచ్చారు.
శానిటేషన్ లో వెహికిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తదితర అంశాల పై చర్చించడం జరిగింది.. జిల్లా కలెక్టర్ వచ్చే వారం నుండి ప్రతి వారం ఒక విభాగం పై సవిూక్ష జరపాలని కోరడం జరిగింది..మున్సిపల్ పనుల్లో పని చేసిన వారు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించేలా ఫస్ట్ కం ఫస్ట్ రికార్డు ప్రకారం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పద్ధతి ప్రకారం బిల్లులు కేటాయింపు జరుగుతుంది.. నిరంతంగా టాస్క్ ఫోర్స్ సిస్టం ని ఏర్పాటు చేసుకొని మున్సిపల్ కి సంబంధించి ప్రజల గ్రీవెన్స్, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఎవరైనా మున్సిపల్ సమస్యలను పరిష్కారం చేసుకునేలా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. వడ్డీలేని రుణాలు 1700 సంఘాలకు ఆన్‌లైన్ లో ట్రాన్సఫర్ చేయబడ్డాయి.. పట్టణంలో మహిళా శక్తిని బలోపేతం చేస్తాం.. భవిష్యత్ లో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
మానేరు రివర్ ఫ్రంట్ పేజ్ 1 లో 72 శాతం పనులు పూర్తయ్యాయి.. ఫేజ్ 2 పనులో డ్రైనేజీ సిస్టం ఇంక్లూడ్ చేయడం జరిగింది త్వరగా ప్రారంభించాలి..టూరిజం ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయాలి.గతంలో 100 కోట్లు నిధులు విడుదల చేశారు.. 30 కోట్లు నిధులు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. 5 కోట్లు ఖర్చు అయ్యాయని నివేదిక ఇచ్చారు.. త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా ముందుకు తీసుకుపోతున్నాం.. స్మార్ట్ సిటీ లో భాగంగా ఇందిరా చౌక్ లో కోటి 30 లక్షల బిల్లు ఉంటే 50 లక్షలు అదనంగా ఖర్చు చేశామన్నారు.. అధికారికంగా అనుమతులు తీసుకొని నిర్మించబడ్డ వాటిపై విజిలెన్స్ ఎంక్వరి జరుగుతుంది.. త్వరలోనే అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది..తప్పుల దొర్లుతున్న వద్ద చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. గతంలో పట్టణంలో పోలిసులు ,రెవెన్యూ ,మున్సిపల్ ఫ్రీ సిగ్నల్ లాగ ఉండాలని అనుకున్నాం తరువాత సిగ్నల్ లు ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ 6 ప్రాంతాల్లో మాత్రమే సిగ్నల్ నడుస్తున్నాయి.. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పోరేషన్ లలో ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.. మున్సిపల్ పరిణితి ,పని విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తము. పట్టణంలో ఏ తప్పూ జరిగిన పై వాళ్ల దృష్టికి తీసుకురండి..ఇంజనీరింగ్, శానిటేషన్, డ్రింకింగ్, మహిళా సంఘాల బలోపేతం, రెవెన్యూ లో ఆదాయం తక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది.. పెద్ద పెద్ద సంస్థల నుండి వ్యవస్థల నుండి రావాల్సిన పన్నులు వసూలు చేయాలని కోరారు. చాలా కాలంగా పని చేస్తున్న వారందరిపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము..తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవు.. విజిలెన్స్ విచారణ జరుగుతుంది.. సిఎం అస్యూరెన్స్ కింద 132కోట్లు శాంక్షన్ అయ్యాయి.. 60 కోట్ల పనులు పూర్తయ్యాయి..కొన్ని పెండిరగ్ ఉన్నాయి.
ప్రభుత్వాలు మారగానే పద్ధతులు మారవు..గతం కన్నా ఎక్కువ నిధులే తీసుకొస్తాం..కేబుల్ బ్రిడ్జి ఎందుకు వచ్చిందో ఎన్ని వాహనాలు ప్రయాణం చేస్తున్నాయో విూకు తెలుసు..అర్బన్ ట్రాఫిక్ విధానంపై సవిూక్షా చేస్తాం..రాబోయే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పై చర్యలు చేపడతాం..హాస్పటల్ మిద త్వరలోనే రివ్యూ ఉంది..వర్ష కాలం వస్తుండడంతో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి..మున్సిపల్ గౌరవం పెరగడానికి ఎవరు ఎలాంటి సలహాలు అయినా ఇవ్వచ్చని మంత్రి అన్నారు. కలెక్టర్ తదితర అధికారులు సవిూక్షలో పాల్గొన్నారు.