19-06-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, జూన్ 19: రాహుల్‌కు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని, త్వరలోనే అది తీరుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఎన్‌డిఎ కూటమిలో ఏ ఒక్కరు తప్పుకున్న మోడీ ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సంజీవరెడ్డి భవనంలో జరిగిన ఈ వేడుకల్లో ఖమ్మం డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ దేశం కోసం పనిచేసే నేత అని కొనియాడారు.