19-06-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, జూన్ 19: ప్రతిరోజు విధుల్లో తీరిక లేకుండా ఉండే పోలీసులు, వారి కుటుంబ సభ్యుల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి ప్రారంభించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్విరామంగా విధులు నిర్వహించిన పోలీసుల కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేర్ ఆసుపత్రి వైద్యులు అందించే అన్ని రకాల వైద్య సేవలను పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆరోగ్యంపై కూడా శ్రద్ద పెట్టాలని పోలీసులకు సూచించారు. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఉన్న అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలన్నారు.