ad1
ad1
Card image cap
Tags  

  19-06-2024       RJ

బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరించిన డిప్యూటి సిఎం భట్టి

తెలంగాణ

హైదరాబాద్‌, జూన్‌ 19: దేశంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాప్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్బన్‌, సెవిూ అర్బన్‌, గ్రావిూణ ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేస్తామన్నారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్‌ రాబోతుందన్నారు.  బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళిక ఆవిష్కరించారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌ అన్నారు. బ్యాంకర్స్‌ కు పాజిటివ్‌ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతున్నాయన్నారు.

వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందన్నారు. వ్యవసాయరంగానికి సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు ఎక్కువ రుణాలు ఇవ్వాలని అన్నారు.అత్యధిక జనాభాకు ఉపాధి కల్పించేవన్నారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉంది.. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఉండదన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్‌ పాలసీని తీసుకురాబోతోందన్నారు. దేశ సంపద అన్ని వర్గాలకు సమానముగా పంచాలనేది రాహుల్‌ గాంధీ ఆలోచన అన్నారు.

ఉమ్మడి కుటుంబం మాదిరిగా జాతి ఐక్యంగా ఉండాలని రాహుల్‌ గాంధీ విధానమన్నారు. అదే జాతికి ఆయన పిలుపు నిచ్చారన్నారు. దేశ సంపద అందరికి పంచాలని రాహుల్‌ గాంధీ విధానం అన్నారు. పెట్టుబడి దారులకు పంచడం బీజేపీ విధానమని కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంపదలో వాటా.. అధికారం లో వాటా ఉండాలి అనేది కాంగ్రెస్‌ విధానమని తెలిపారు. పెద్ద ప్రాజెక్టులు టెక్నీకల్‌ నాలెడ్జి ఉన్న వాళ్ళు కట్టాలన్నారు. వాళ్ళు కాదు నేనే కడతా అని కేసీఆర్‌ కడితే కాళేశ్వరం కూలిపోయిందన్నారు. పనిలేని వాళ్ళు కొందరు పనికి మాలిన మాటలు మాట్లాడతారి మండిపడ్డారు. పని లేక గాడిద పళ్ళు తోమారు అనే వాళ్ళు.. ఇప్పుడు అదే మాటలు మట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం గురించి నిపుణులు సలహాలు మేరకు పనులు చేస్తామన్నారు. మేము చేసిన అప్పులో.. అప్పుల కోసం కట్టినవే ఎక్కువ అన్నారు. 36 వేల కోట్లు అప్పులకు కట్టిన్నామని తెలిపారు.

బడ్జెట్‌ లో పొందుపరిచిన మేరకు అప్పులు తెస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడు అనేది చూస్తున్నామని తెలిపారు. దాని ఆధారంగా బడ్జె పెడతామన్నారు. జగదీశ్‌ రెడ్డి నే.. జ్యుడీషియల్‌ విచారణ అడిగారని తెలిపారు. మేము ప్రజాస్వామ్యం నమ్మే వాళ్లుగా? విచారణకు అదేశించా మన్నారు. కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్‌ కాదన్నారు. గతంలో విద్యుత్‌ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామన్నారు. కమిషన్‌ ఎవరు ఉండాలని మేము వేసింది కాదు.. మాకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మేము ఎవరం రోజు వారీ సవిూక్ష చేయడం లేదన్నారు. జ్యుడీషియల్‌ విచారణ తప్పు పెట్టాల్సిన అవసరం ఏముందని తెలిపారు. దిగిపో అనాల్సిన పనేముంది అని మండిపడ్డారు. వెళ్లి వివరాలు ఇవ్వచ్చుగా అన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారని తెలిపారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రైతు బంధు వేయరు అనే ప్రచారం చేశారు.. కానీ వేసి చూపించామన్నారు.

రుణమాఫీ మిలాగా నాలుగు సార్లు చేస్తామని.. అనలేదన్నారు. అందరూ మిలాగే ఉంటారని అనుకోకండి అన్నారు. మేము చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తమ మొదటి ప్రాధాన్యమని భట్టి విక్రమార్క వివరించారు.ఈ సందర్భంగా హరీష్‌రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. గత పదేళ్ళ పాలనను హరీష్‌ రావు మర్చిపోయారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లా అండ్‌ ఆర్డర్‌ మా ఫస్ట్‌ ప్రేయారిటి అన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్డడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ఇదిలావుంటే ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశంలో తెలిపారు. ప్రతి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ పండిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. బహుళజాతి, ఇన్‌ఫ్రా కంపెనీలకు రూ.వేల కోట్ల రుణాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం ఉండకూడదని చెప్పారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP