19-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 19: ఐదేళ్లపాటు పడావుపడిన అమరావతికి మళ్లీ పునర్వైభవం రానుంది. అమరావతికి అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించ నున్నారు. ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. గురువారం తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు పర్యటనకు బయలుదేరుతారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం పర్యటనను ప్రారంభించనున్నారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల విూదుగా రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు.
అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల ను, ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్ లను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించ నున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు విూడియాతో మాట్లాడుతారు. ప్రధానంగా 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసి.. భవనాలను పడావుబెట్టారు. 70, 80 శాతం నిర్మాణం పూర్తిచేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి.. నిర్మాణాల స్థితిగతులను పరిశీలించ నున్నారు. అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.