19-06-2024 RJ
సినీ స్క్రీన్
’కల్కి’ విడుదలకు ముందు సర్‌ప్రైజ్‌లు ఉంటాయని దర్శకుడు నాగ్‌అశ్విన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా ఇందులో అలనాటి నటి శోభన ఉన్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన పలువురు అగ్ర నటీనటులు భాగమయ్యారు. ఇప్పుడు అలనాటి నటి శోభన కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారంటూ ఆమె లుక్‌ను విడుదల చేశారు. ’ఆమె పూర్వీకులు కూడా ఆమెలానే వేచి ఉన్నారు’ అనే క్యాప్షన్‌ను జోడిరచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ’కల్కి’లోని అతిథి పాత్రల గురించి చెప్పాలని నాగ్ అశ్విన్‌ను అడగ్గా ’వేచి ఉండండి’ అని ఆయన నవ్వుతూ బదులిచ్చారు. ఇప్పుడు విడుదలకు మరో 8 రోజులే ఉండడంతో ప్రమోషన్‌లో భాగంగా ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఒక్కప్పుడు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన శోభన తెలుగులో చివరిసారి 2006లో వచ్చిన ’గేమ్’లో కనిపించారు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత ’కల్కి 2898 ఏడీ’ తో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. తెలుగు రాష్టాల్లోన్రూ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటించారు. సీనియర్ హీరో కమల్‌హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దిశా పటానీ రోక్సీ పాత్రతో అలరించనున్నారు.