19-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 19: సాప్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా గచ్చిబౌలితో పాటుగా ఐదు బ్రాంచ్‌లు ఓపెన్ చేసింది. ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది నిరుద్యోగుల దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 నుంచి 50వేల రూపాయలు వసూలు చేసింది ఈ సంస్థ. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రూ. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామాంటూ యాజమాన్యం నిరుద్యోగులకు షాకిచ్చింది. కంపెనీ చేసిన మోసంతో దాదాపుగా 100 మంది ఉద్యోగులు రోడ్డు విూద పడ్డారు. దీంతో బాధితులంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.