20-06-2024 RJ
సినీ స్క్రీన్
’భైరవ అంథమ్’ ఇండియన్స్ బిగ్గెస్ట్ సాంగ్ అఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో వుంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ `ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ముంబై లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కాగా కల్కిలో దీపిక గర్భవతిగా కనిపించింది. విశేషమేమిటంటే.. ఇప్పుడు నిజ జీవితంలోనూ దీపికా పదుకోణె గర్భంతో ఉంది. ముంబైలో ’కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ దీపికా హాజరైంది.
అయితే నిండు గర్భంతో ఉన్న ఆమె స్టేజి విూద నుంచి కిందకు దిగుతున్న సమయంలో ప్రభాస్ చెయ్యి అందించి సహాయం చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న అమితాబ్ బచ్చన్ సరదాగా ప్రభాస్, దీపికను సరదాగ ఆట పట్టించారు. ప్రభాస్ భుజం తట్టి నైస్ అన్నట్టు ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మహిళలను గౌరవించడం ప్రభాస్ తర్వాతే ఎవరైనా, పాన్ ఇండియా స్టార్ సింప్లిసిటీకి ఇది నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.