ad1
ad1
Card image cap
Tags  

  20-06-2024       RJ

ఏపీ సిఎం చంద్రబాబు సొంత టీమ్‌ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్

  • పలు కీలక స్థానాల్లోకి అనుభవజ్ఞులైన అధికారులు
  • పాలనలో ఇక తనదైన మార్కు చూపేలా చర్యలు
  • డిజిపిగా ద్వారకాతిరుమల రావు నియామకం

అమరావతి, జూన్‌ 20: అధికారుల బదిలీలో సిఎం చంద్రబాబు నాయుడు తనకు అనుకూలమైన టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పాలనలో చెప్పిన పనులు చేసే అధికారులే కాకుండా నిజాయితీగా పనిచేయడం కూడా ముఖ్యమే. అందుకే చంద్రబాబు తనకు నమ్మకస్థులైన వారిని ఎంచుకుంటారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆయన గతంలో పనిచేసిన కొందరు అదికారులను పక్కన పెట్టారు. అలాగే పలువురు అంగటకాగిన వారిని దూరం పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలక అధికారులను బదిలీ చేశారు. గత ప్రభుత్వానికి సన్నిహితంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కుంటున్న పలువురు అధికారులపై బదిలీ వేటు పడిరది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం జారీ చేసిన జిఓలో ఆ అధికారులకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. జిఎడిలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ జాబితాలో పట్టణాభివృద్దిశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌, ఎక్సైజ్‌లో ఉన్న రజత్‌ భార్గవ ఉన్నారు. రాజధాని అమరావతిని దెబ్బతియ్యడం లోనూ, విశాఖలో టూరిజం భవనాలను సిఎంకు కేటాయించవచ్చంటూ నివేదికను రూపొందించడంలోనూ శ్రీలక్ష్మి చురుకైప పాత్ర నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి.

గత ప్రభుత్వంలోని పెద్దల సూచనల మేరకు ఉపాధ్యాయులపై పెద్దఎత్తున వేధింపు చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రవీణ్‌ప్రకాశ్‌పై ఉన్నాయి. పెద్దఎత్తున సస్పెన్షన్లకు దిగడంతో పాటు, వైన్‌షాపుల మందు కాపలాకు కూడా ఆయన ఉపాధ్యాయులను వినియోగించారు. ఎకైజ్‌ శాఖలో జరిగిన అవినీతిని అడ్డుకోకపోవడంతో పాటు, సహకరించారన్న ఆరోపణ కూడా రజిత్‌ భార్గవ్‌పై ఉంది. దీంతో ఈ ముగ్గురికి తాజాగా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఎన్నికల సమయం లో పెన్షన్‌కోసం వృద్దులను సిఎస్‌తో పాటు, సెర్ప్‌ సిఇఓ మురళీధర్‌రెడ్డి కూడా ఉద్దేశ్యపూర్వకంగా తీవ్ర ఇబ్బందులు పాల్జేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదు పేదలకు ఇళ్ల పేరుతో సిఆర్‌డిఏ మాస్టర్‌ ఎª`లాను మార్పులో కీలకంగా వ్యవహరించిన వివేక్‌యాదవ్‌ను కూడా జిఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. మార్పు విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారనే ఉద్దేశంతో అభ్యంతరాలకు కూడా సరైన సమయం ఇవ్వకుండా చేశారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అదే సమయంలో గత టిడిపి ప్రభుత్వంలో సమర్థవంతంగా వ్యవహరించిన అధికారులకు మరలా ప్రాధాన్యత కలిగిన పోస్టింగులు ఇచ్చారు. 2019 వరకూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో చురుకుగా వ్యవహరిం చిన కాటంనేని భాస్కర్‌ను తీసుకొచ్చి కీలకమైన సిఆర్‌డిఏ కమిషనర్‌గా నియమించారు.

గతంలో సిఎంకు సెక్రటరీగా వ్యవహరించిన పి.ఎస్‌.ప్రద్యుమ్నను మరలా సిఎం కార్యదర్శిగా నియమించారు.డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాను రాష్ట్రప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావును నియమించింది. ఈ మేరకు సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి చంద్రబాబు సీఎం కాగానే.. ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారని అంతా భావించారు. ఎన్నికల సమయంలో నాటి డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ఈసీ తొలగించి హరీశ్‌కుమార్‌ గుప్తాను నియమించింది. ఆయననే కొనసాగించాలని కొత్త ప్రభుత్వం కూడా భావించింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా జరిగిన గందరగోళం ఆయనకు ప్రతికూలంగా మారింది.ఆ రోజున ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికి.. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పదవీప్రమాణం చేయించాల్సిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయన కాన్వాయ్‌ దాదాపు 40 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ఆయన ప్రధాని మోదీ స్వాగత కార్యక్రమానికి రాలేకపోయారు. ఆ రోజు ట్రాఫిక్‌ నియంత్రణలో విషయంలో డీజీపీ గుప్తా పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

చివరికి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్‌ కాన్వాయ్‌కు ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై ప్రధాని మోదీ కూడా అసహనం వ్యక్తం చేశారు. చివరకు తిరుగు ప్రయాణ సమయంలో తనకు వీడ్కోలు పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి ఎవరు రావద్దని ఒక్కరే వెళ్లిపోయారు. అప్పుడే గుప్తాపై బదిలీ వేటు పడుతుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం కొన్నాళ్లు ఆగి బదిలీ చేసింది. ఇప్పుడు ఆయన స్థానంలో సమర్థుడు, నిజాయితీపరుడిగా పేరున్న 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావును నియమించింది. ద్వారకా తిరుమల రావు ప్రస్తుతం ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కీలక పోస్టుల్లో పనిచేశారు. నిబద్ధత కలిగిన పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా డీజీపీని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం సమయం లేకపోవడంతో ప్రభుత్వం నియమించింది. నేరుగా డీజీపీ పోస్టు ఇవ్వకుండా డీజీపీ (కో`ఆర్డినేషన్‌) పోస్టులో నియమించింది. ఆ స్థానంలో ఉండి ఆయన డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. గుప్తాకు కూడా కీలకమైన హోం శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యత అప్పగించింది. సామాన్య కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి.. జాతీయస్థాయిలో సివిల్స్‌కు ఎంపికైన ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు.

ఇప్పుడు డీజీపీగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. తిరుమలరావు గుంటూరు వాసి. దేవాపురంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగంలో అధికారిగా పనిచేశారు. వారికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో ఐదో తరగతి వరకు, తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. కొంత కాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీలో మేథ్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. తిరుమల రావు భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. తిరుమలరావు చెన్నై సీబీఐలో కొంతకాలం పనిచేశారు. గుంటూరులో చిన్ననాటి నుంచి తనతో కలిసి చదువుకున్న స్నేహితులతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి.

31, Aug 2024

ఏపీలో భారీ వర్షాలుతో.. ఏడుగురి మృతి

21, Aug 2024

అనకాపల్లి జిల్లాలో.. ఫార్మా యూనిట్‌లోని రియాక్టర్‌ పేలుడు, 14 మంది మృతి

15, Aug 2024

ప్రతి ఇల్లు, కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆంధ్రా సీఎం పిలుపునిచ్చారు

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP