20-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 20: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దేశంలోకి ముందుగానే ప్రవేశించినా వర్షాలు మాత్రం అంతంతగానే కురుస్తున్నాయి. ఇప్టపికీ ఎండవేడిమి, ఉక్కపోత తగ్గడం లేదు. ఇప్పటి వరకు 20శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. జూన్ 12-18 మధ్య రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని పేరొన్నది. రానున్న 3-4 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, బీహార్, జార్కండ్లో పరిస్థితులు అనుకూలంగా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1-18 మధ్య భారత్లో 64.5 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ వెల్లడిరచింది. సాధారణంగా ఈ సమయంలో సగటున 80.6 మివిూ వర్షపాతం కురవాల్సి ఉందని తెలిపింది.
జూన్ 1నుంచి భారత వాయువ్య ప్రాంతంలో 10.2 మివిూ (సాధారణం కంటే 70శాతం తకువ), మధ్య భారత్లో 50.5మివిూ (సాధారణం కంటే 31శాతం తకువ), దక్షిణాదిలో 106.6 మివిూ (సాధారణం కంటే 16శాతం అధికం), తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 146.7మివిూ అంటే సాధారణం కంటే 15శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేరొన్నది.జూన్ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తకువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణాది, ఈశాన్య రాష్టాల్లో సాధారణం, అంతకంటే ఎకువ, వాయువ్యం, మధ్య భారత్లో సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదు కావచ్చని పేరొన్నది.