20-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 20: అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్న రాష్ట్రం ఏపీ అని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. పర్యాటకశాఖ మంత్రిగా సచివాలయం రెండో బ్లాక్‌లో కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లాల్సిన ప్రాంతాలను వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రజానీకం వైకాపాకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. కోనసీమ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయని, రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సినిమా షూటింగ్‌లు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఏపీలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కోనసీమ, కృష్ణా పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయని.. గత పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేసి సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటామన్నారు. నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని? ఏపీలో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారు. రెండు కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మొదటి సంతకం పెట్టానని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో పర్యాటక, సాంస్కృతిక విధానాలను సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.
రిషికొండలో జగన్ నిర్మించిన ప్యాలెస్ కి బదులు పేదవాళ్ల కోసం ఓ హాస్పిటల్ నిర్మిస్తే రాష్ట్ర ప్రజలకు ఉపయోగంగా ఉండేదన్నారు. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు గాని, చేసిన తప్పుకు చర్యలు, శిక్షలు మాత్రం ఉంటాయని మంత్రి పేర్కొన్నారు, లేకపోతే తప్పులు చేయటం అలవాటుగా మారిపోతుందన్నారు. సినీ రంగ పెద్దలతో మాట్లాడి, సినీ రంగానికి ఊతం ఇచ్చే విధంగా మా చర్యలు ఉంటాయన్నారు. సినీ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.