20-06-2024 RJ
తెలంగాణ
వరంగల్, జూన్ 20: యువత ఎంతగా దిగజారిపోతున్నారంటే.. సోషల్ విూడియా, రీల్స్, ఫేమస్ అవ్వాలని ఆరటపడి ప్రాణాల విూదకు తెచ్చుకుంటున్నారు. లైక్ లు, షేర్ల కోసం లైఫ్ ను పనంగా పెడుతున్నారు. రీల్స్ పిచ్చిలో స్టంట్లు చేస్తున్నారు. తాజాగా రీల్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది. వరంగల్ జిల్లాకు చెందిన అజయ్ (23) చనిపోయినట్లు నటిస్తూ రీల్స్ చేయాలని చూసి నిజంగానే చనిపోయాడు. ఉరివేసుకున్నట్లు రీల్ చేద్దామనుకున్న అజయ్.. మెడకు ఉరితాడు బిగించుకొని ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ రింగ్ అవ్వడంతో కంగారులో కదిలాడు. తాడు గొంతుకు ఉచ్చు బిగుసుకొని చనిపోయాడు. దీంతో ఊపిరాడక అజయ్ అనే 23 ఏళ్ల యువకుడు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేటలోని తన చిన్నక్క ఇంట్లో జరిగిందీ ఘటన. అజయ్ మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు మృతుడి తల్లి దేవమ్మ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.