21-06-2024 RJ
సినీ స్క్రీన్
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉండి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే నెత్తిన పెట్టేసుకుంటున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా కొత్త తరహా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ క్రమమంలోనే ఒక ఆసక్తికరమైన సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు హీరోలుగా జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించిన సినిమా EVOL(LOVE) ని రివర్స్లో చూస్తే EVOL అని ఈ సినిమా కూడా ఒక రివర్స్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతుందని ప్రొడ్యూసర్ – డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి వెల్లడించారు.
రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. ఎవోల్ EVOL (a love story in reverse) డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను శుక్రవారం ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన పత్రిక సమావేశంలో దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ.. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య అండర్‌స్టాండింగ్, నేపథ్యంలో సాగే కథ అని. సినిమా డిఫరెంట్ అంశాలు, వాణిజ్య విలువలతో క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిందని ఆధ్యంతం ఉత్కంఠగా సాగుతుంది అని చిత్రం యూనిట్ తెలిపారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం అని అన్నారు.
నటీనటులు :
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్
టెక్నీషియన్స్ :
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్,
కెమెరా: తేడా బ్యాచ్ సినిమా టీమ్,
ఎడిటర్: విజయ్,
కళ: యోగి వెలగపూడి,
కొరియోగ్రాఫర్: జిన్నా
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-నిర్మాత-దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి
పి ఆర్ ఓ : మధు VR