21-06-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, జూన్ 21: పత్తిని పండించడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉన్నా గార్మెంట్ తయారీ రంగంలో వెనకబడి ఉన్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని అన్నారు. చిన్న దేశమైన బంగ్లాదేశ్ 10 శాతం, చైనా 38 శాతం గార్మెంట్ తయారీ రంగంలో ముందున్నాయని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితి మారాలన్నారు. స్థానికంగా దుస్తులను తయారు చేయడం వల్ల ఇతర దేశాలతో పోటీ పడాలని ఆయన సూచించారు. తద్వారా స్థానికులకు, ఈ రంగంలో ఉన్నవారికి మంచి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.
మనదగ్గర పండుతున్న పత్తితో దేశంలో నంబర్ వన్ స్థానాన్ని అక్రమించవచ్చన్నారు. గ్రావిూణ ప్రాంతాలు ఆభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమని గుర్తించిన కెసిఆర్ అనేక కార్యక్రమాలతో దారి చూపారాని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమని చాటారని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో 14 ఏళ్లు శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ అన్నారు.