21-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత సభకు విచ్చేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను అవమానించడంతో శపథం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు సభకు రావడంతో ఆయన సతీమణీ భువనేశ్వరి సంతోష పడ్డారు. సోషల్ విూడియాలో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం అంటూ రాశారు. ఆనాడు సభలో చంద్రబాబు శపథం చేశారని.. ఈ రోజు అదే సభలో ముఖ్యమంత్రిగా అడుగిడారని పేర్కొన్నారు. సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎదురెదురుగా ఉన్న దృశ్యాన్ని భువనేశ్వరి ఆసక్తిగా తిలకించారు.