21-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, జూన్ 21: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య ప్రొఫెసర్ లావణ్యాదేవిపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఆమె ఆంధ్రా విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భర్త తరఫున ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఉన్నతాధికారులు అప్పట్లో లావణ్యాదేవిని సస్పెండ్ చేశారు. తాజాగా ఆమెపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.