21-06-2024 RJ
సినీ స్క్రీన్
’కల్కి 2898 ఏడీ’ విడుదల సమయం సవిూపిస్తుండడంతో చిత్రబృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఓవైపు వేడుకలు నిర్వహిస్తూ మరోవైపు.. సినిమాలో కీలక పాత్రలు పోషించిన వారి లుక్స్‌ను సోషల్ విూడియా వేదికగా పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ’ది లక్కీ రెబల్’ అంటూ కైరా క్యారెక్టర్ ప్లే చేసిన నటిని గురువారం సాయంత్రం ప్రత్యేకంగా పరిచయం చేసింది. దీంతో, ఆమె గురించి తెలుసుకునేందుకు చాలామంది నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఈ మలయాళ నటి ’కల్కి’లోని ఓ పాత్రకు ఎంపికైనట్టు చాలా తక్కువమందికి తెలుసు. తాజా పోస్టర్‌తో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె.. అన్నా బెన్. కొచ్చికి చెందిన బెన్ అక్కడే ’ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్’లో పట్టా పొందారు. తన తండ్రి స్క్రీన్ రైటర్ బెన్నీ పి. నాయరాంబలం. మలయాళంతో పాటు తమిళ్ చిత్ర పరిశ్రమలో పనిచేశారాయన.
సినీ నేపథ్య కుటుంబం కావడంతో అన్నాకు బాల్యంలోనే నటనపై ఆసక్తి కలిగింది. చదువు పూర్తయిన అనంతరం.. మలయాళ సినిమా ’కుంబలంగి నైట్స్’ (2019)తో తెరంగేట్రం చేశారు. ఉత్తమ పరిచయ నటిగా ’సైమా’, ’కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సహా పలు పురస్కారాలు అందుకున్నారు. కమర్షియల్‌గానూ ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసుకొంది. ప్రతీ సినిమాకి ఏదో ఒక అవార్డు సొంతం చేసుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఈ బ్యూటీ నటించిన ’కొట్టుక్కాళి’ చిత్రం 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవడం విశేషం. ఆమె నటించిన తొలి తమిళ్ సినిమా ఇదే. ఇప్పుడు ’కల్కి’తో తెలుగు ఆడియన్స్‌ను నేరుగా పలకరించనున్నారు.
‘దర్శకుడు నాగ్ అశ్విన్ ’కల్కి’ గురించి చెప్పగానే ఎంతో ఆనందించా. ఇప్పటివరకూ నేను సైన్స్ ఫిక్షన్ సినిమా చేయలేదు. ఆ డ్రీమ్ ’కల్కి’తో నెరవేరింది. ప్రభాస్ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రతిభావంతులతో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. ఇందులో నేను పోషించిన పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపుతుందని ఓ ఇంటర్వ్యూలో ఆశాభావం వ్యక్తం చేశారు.