ad1
ad1
Card image cap
Tags  

  21-06-2024       RJ

తెలంగాణ రైతాంగానికి శుభవార్త.. కేబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం

తెలంగాణ

  • ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల రుణమాఫీ
  • ఐదేళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు వర్తింపు
  • 2018 డిసెంబరు 11 కటాఫ్‌ తేదీగా నిర్ణయం
  • 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు పరిగణన
  • విూడియాకు వివరాలు వెల్లడించిన సిఎ రేంవత్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 21: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఏకమొత్తంలో రణమాఫీ చేయడంతో పాటు, విధివిధానాలను రూపొందించనుంది. ఈ క్రమంలో రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. రుణమాఫీకి కటాఫ్‌ నిర్ణయించింది. డిసెంబర్‌ 9వ తేదీని రుణమాఫీ కటాఫ్‌ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది రాష్ట్ర కేబినెట్‌. అంతేకాదు.. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది. డిసెంబర్‌ 9, 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. ఎన్నికల హావిూలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రుణామాఫీలు చేస్తామని హావిూ ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ ఉండటం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ లేకపోవడంతో రుణాల మాఫీపై స్పీడ్‌ పెంచింది సర్కార్‌. ప్రధానంగా ఆగస్ట్‌ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ఆ ప్రకటన మేరకు.. ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. రైతు రుణాల మాఫీ ప్రధానంశంగా రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నాడు భేటీ అయ్యింది. ఈ భేటీలో రైతు రుణమాఫీ ఎలా చెయ్యాలి. దశల వారీగా చేయాలా? ఒకేసారి చేయాలా? అర్హులు ఎవరు? ఎవరి రుణాలు మాఫీ చేయాలి? అంశాలపై కూలంకశంగా చర్చించారు. అనంతరం.. రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని తీర్మానం చేశారు. అది కూడా ఆగస్ట్‌ 15 లోపు ఈ పక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రుణమాఫీపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 9 2023లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్‌ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధుల సవిూకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ట్యాక్స్‌ చెల్లింపు దారులు రైతు రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. ఇప్పటికే అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్‌ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు అధికారులు. ఈ కేబినెట్‌ మొత్తం రైతులకు సంబంధించిన ప్రయోజనాలపైనే ఎక్కువగా చర్చించారు.

కేబినేట్‌ భేటీ అనంతరం మంత్రులతో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి వివరాలను విూడియాకు వెల్లడిరచారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్‌ విధానమని, రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ.. ఏదైనా మాట చెబితే అది శిలా శాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం మా నాయకుల గొప్పతనం.. కమిట్‌ మెంట్‌. 2022 మే 6  వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభలో రాహుల్‌ గాంధీ రుణమాఫీ హావిూ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హావిూ మేరకు రూ.2లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014, 2018లో రుణమాఫీ చేసింది. మొదటిసారి రూ.16వేల కోట్లు, రెండో సారి రూ.12వేల కోట్లు రుణమాఫీ చేసింది. అప్పటి ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. మా ప్రభుత్వం 2018 డిసెంబరు 12 నుంచి మొదలు పెట్టి.. 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌ తేదీగా పరిగణనలోకి తీసుకుంది. ఐదేళ్ల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని తెలిపారు.

రుణమాఫీ విధివిధానలను జివోలో తెలియచేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని అన్నారు. డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తుందని అన్నారు. జులై 15లోపు ఉప సంఘం నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేస్తాం. రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు అవసరమని అంచనా వేశాం. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను ఇకపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విూడియా సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే, ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP