21-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, జూన్ 21: బీజేపీలో చేరేందుకు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విూడియాకు చెప్పారు. ఇప్పటికే మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారని ప్రకటించారు. ఈ క్రమంలో వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని స్వయంగా మిధున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారని అయినప్పటికీ తాము చేరుతామని మిథున్ రెడ్డి ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి విూద కూడా మిధున్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు.
అసెంబ్లీ లాబీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. భాజపా అంగీకరిస్తే అవినాష్‌రెడ్డి మినహా వైకాపా ఎంపీలంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, భాజపా నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోంది. అయినా.. మేం చేరతామంటూ మిథున్‌రెడ్డి ఇంకా లాబీయింగ్ చేస్తున్నారు. భాజపాలో చేరాలని ఆయన తండ్రి పెద్దిరెడ్డి విూద కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటు న్నారు. చెల్లి వల్లే నష్టపోయామని జగన్ తెలుసుకున్నాడు. చెల్లితో రాజీ చేయాలని తల్లిని కోరాడు. అన్ననే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేసింది. త్వరలోనే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టవుతారు. కడప ఉప ఎన్నికల్లో భూపేశ్‌రెడ్డి తెదేపా తరఫున పోటీ చేసి గెలుస్తారని ఆదినారాయణరెడ్డి తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరామన్నారు.
మద్యం, ఇసుక మాఫియాల విూదే కాకుండా చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందని ఆరోపణలు చేశారు. విద్యుత్ రంగంలో స్మార్ట్ విూటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయని.. జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆదినారాయణ రెడ్డి కోరుతున్నారు. వైసీపీ గెలిచిది నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే. అందులో రాజంపేట, తిరుపతి, అరకు, కడప స్థానాలు ఉన్నాయి. రాజంపేట, తిరుపతి స్థానాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలంతో గెలిపించుకున్నారు. పెద్దిరెడ్డి కుటుబం నుంచి పోటీ చేసిన ముగ్గురూ విజయం సాధించారు. కానీ పెద్దిరెడ్డి టీడీపీని టార్గెట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబుపై రాళ్ల దాడి వెనకు ఆయన ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. ఆయనకు మైనింగ్, మిల్క్, కాంట్రాక్ట్‌లు వంటి బిజినెస్‌లు ఉన్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ చేస్తే తాము ఇబ్బంది పడతామని అనుకుంటున్నారు. బీజేపీలో ఉంటే సేఫ్‌గా ఉంటామన్న ఉద్దేశంతో ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణ రెడ్డి వారం రోజుల కిందట కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే అప్పుడు ఎవరూ ఖండించలేదు. మిథన్ రెడ్డి కూడా ఖండిరచలేదు. దీంతో మరోసారి ఆదినారాయణరెడ్డి అవే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం.. గతంలో వైసీపీ పాలన అంతా కక్ష సాధింపుల మయం కావడంతో.. తమపైనా అలాగే ప్రవర్తిస్తే ఇబ్బందులు పడతామన్న ఉద్దేశంతో .. వైసీపీ నేతలు సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు.