21-06-2024 RJ
సినీ స్క్రీన్
ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తంచేశారు. ’మాలా ఉండేందుకు ప్రయత్నించకండి’ అంటూ సదరు వ్యక్తికి సూచించారు. సోషల్ విూడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి తన సినిమాల విశేషాలతోపాటు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ముచ్చటిస్తుంటారనే సంగతి తెలిసిందే. ’సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ సదరు నెటిజన్ కోరగా ఆమె స్పందించారు.ఓకే.. ఇలాంటి వివక్షలే వద్దు. విూరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్ అని అనడం సరైంది కాదు. విూరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దని అన్నారు. బాలీవుడ్ నటులు.. దక్షిణాది నటులను చిన్నచూపు చూస్తుంటారని, దాన్ని దృష్టిలోపెట్టుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చారేమోనని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తంచేశారు.
పలు సినీ వెబ్‌సైట్స్ సైతం ఈ కోణంలోనే కథనాలు రాశాయి. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ పెళ్లి వేడుకలో బాలీవుడ్ హీరో ఒకరు.. దక్షిణాది హీరోను చులకనగా చూడడమే శ్రుతి అసహనానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి. ఇటీవల తన రిలేషన్ స్టేటస్ గురించి తెలిపిన సంగతి తెలిసిందే. విూరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా? అని సోషల్ విూడియా వేదికగా ఒకరు ప్రశ్నించగా తనకు ఆ తరహా ప్రశ్నలు నచ్చవంటూనే సింగిలే అని క్లారిటీ ఇచ్చారు. రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. సినిమాల విషయానికొస్తే.. ’డకాయిట్’, ’చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ’సలార్’ సీక్వెల్ ’సలార్ 2’ లోనూ సందడి చేయనున్నారు.