22-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 22: దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్ మాట్లాడుతూ.. ‘అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసి వేసి నాలుగేళ్లు అయ్యింది. పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రి మార్చారు. విపరీతమైన రద్దీ కారణంగా ఇన్‌ఫెక్షన్ల శాతం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లపై లిఖితపూర్వక హావిూ ఇవ్వాలని కోరారు.