22-06-2024 RJ
సినీ స్క్రీన్
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024, హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా"లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును. "కళావేదిక"(R.V.రమణ మూర్తి గారు)," రాఘవి మీడియా" ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క) గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ నెల 29న సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.