ad1
ad1
Card image cap
Tags  

  22-06-2024       RJ

రాజాసింగ్‌ వీడియోతో పార్టీలో కలకలం

తెలంగాణ

  • అదిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న రఘునందన్‌

హైదరాబాద్‌, జూన్‌ 22: బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకంపై బిజెపిలో కలకలం రేగుతోంది. ఓ వైపు ఢిల్లీలో కొందరు పైరవీలు చేస్తుండగా, తాజాగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వీడియో కలకలం రేపింది. ఈ క్రమంలో అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు స్పందించారు. ’పార్టీ అధిష్ఠానం ఆదేశాలను తప్పకుండా పాటిస్తాను. కండువా కప్పుకున్న రోజు నుంచే నేను పార్టీ కార్యకర్తను. కొత్తగా వచ్చిన నేతలకు పదవి రాదు అనేది ఏమి లేదు. హిమంత బిశ్వశర్మకు సీఎం పదవే వచ్చింది. క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చని అన్నారు ఈ క్రమంలోనే రాజాసింగ్‌ తన అభిప్రాయం చెప్పారు’ అని అన్నారు. తెలంగాణ రాజకీయాలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గొర్రెల స్కాం, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన అధికారులు అంతా కేసీఆర్‌ పేరే చెబుతున్నారని అన్నారు. అన్ని వేళ్లు కేసీఆర్‌వైపే చూపిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే కేసీఆర్‌ ఇంటికి ఈడీ రాక తప్పదని అన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర బీజేపీలో గ్రూపుల లొల్లి కొనసాగుతోంది.

రాష్ట్ర అధ్యక్ష పదవికోసం పలువురు లీడర్లు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను కలిసి ఆశీస్సులు పొందుతున్నారు. మరికొందరు ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ తరుణంలో గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన కామెంట్లు సంచలనం రేకెత్తించాయి. ఆయన విడుదల చేసిన వీడియో హాట్‌ టాపిక్‌ గా మారింది. పరోక్షంగా ఎవరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వొద్దో ఈ వీడియోలో చెప్పేశారు. గత కాలంగా బీజేపీ స్టేట్‌ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో రాజాసింగ్‌ కు గ్యాప్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెగ్యులర్‌ గా నాంపల్లి ఆఫీసుకు వచ్చి ప్రెస్‌ విూట్లు పెట్టిన రాజాసింగ్‌ ఇప్పుడు ఆఫీసు రావడం లేదు. గోషామహల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌కు పార్టీ ప్లోర్‌ లీడర్‌ పదవిని ఇస్తారనే చర్చకూడా సాగింది. అయితే రకరకాల కారణాలతో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి ప్లోర్‌ లీడర్‌ పోస్టు అప్పగించారు.

దీంతో ఆయన అలకబూనారని తెలుస్తోంది. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌ ఎంపీగా అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలతను ప్రకటించిన నేపథ్యంలో రాజాసింగ్‌ చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఇటీవల హైదరాబాద్‌ లో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ల సన్మానం కోసం నిర్వహించిన ’సెల్యూట్‌ తెలంగాణ’ సభకు కూడా రాజాసింగ్‌ హాజరు కాలేదు. మరుసటి రోజు (నిన్న) ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఎలా ఉండాలో చెప్పారు. ఈ వీడియో సందేశం చూసిన వారికి ఎవరిని నియమించవద్దో డైరెక్టుగానే చెప్పినట్టు అర్థమవుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు? ఎవరు పరోక్షంగా రాజాసింగ్‌ తో చెప్పించారనేది చర్చనీయాంశంగా మారింది.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవి రేసులో ఐదుగురు నేతలున్నారు. ఎవరిక వారుగా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, మహబూబ్‌ నగర్‌ ఎంపీ డీకే అరుణ, మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాజాసింగ్‌ కామెంట్‌ చేసినట్టు చూసుకుంటే వీరిలో ఈటల రాజేందర్‌ వామపక్ష భావాలున్న నాయకుడు. బీఆర్‌ఎస్‌ లో కొనసాగి బీజేపీలోకి మారారు. డీకే అరుణ గతంలో కాంగ్రెస్‌ లో మంత్రిగానే విధులు నిర్వర్తించారు. రఘునందన్‌ రావు కూడా గతంలో బీఆర్‌ఎస్‌ లో చాలా కాలంపాటు పనిచేశారు. కేసీఆర్‌ కు సన్నిహితుడిగా కూడా కొనసాగారు. ఇక మిగిలింది. రాంచందర్‌ రావు, నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌. వీళ్లిద్దరిలో రాంచందర్‌ రావు పూర్తి ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ కలిగిన లీడర్‌. మొదటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. మరో నాయకుడు ధర్మపురి అర్వింద్‌ ఆయన రాజకీయ జీవితం బీజేపీలోనే ప్రారంభమైంది. రాజాసింగ్‌ చెప్పిన రెండో స్వభావం దూకుడు అరవింద్‌ కు ఉంది.

రాజాసింగ్‌ పరోక్షంగా అర్వింద్‌ కు మద్దతు ఇచ్చారా..? లేదా రాంచందర్‌ రావును సపోర్ట్‌ చేస్తున్నారా..? అన్న చర్చనడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్నవారిని నియమించాలని రాజాసింగ్‌ కోరారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూనే దూకుడుగా వ్యవహరించే వ్యక్తికే పగ్గాలు అప్పగించాలనే మరో సూచన చేశారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP