22-06-2024 RJ
సినీ స్క్రీన్
బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ రూమర్స్‌పై ఇద్దరూ ఇప్పటివరకూ స్పందించలేదు. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. సోనాక్షి` ఇక్బాల్‌ల వివాహం ఆదివారం జరగనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని సోనాక్షి ఇంట నిర్వహించిన మెహందీ వేడుక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫంక్షన్‌కు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరైనట్టు సమాచారం. ’డబుల్ ఎక్స్‌ఎల్’ సినిమాలో కలిసి నటించిన ఇక్బాల్, సోనాక్షిల మధ్య స్నేహం ఏర్పడింది.
తర్వాత అది ప్రేమగా మారింది. తన కుమార్తె వివాహంపై వచ్చిన వార్తలపై ఇటీవల నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. ‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. నేనే తన బలం అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తా అని తెలిపారు. అంతకు ముందు ఓ సందర్భంలో స్పందిస్తూ.. సోనాక్షి, ఇక్బాల్‌ల ప్రయాణం గురించి తనకేవిూ తెలియదనడం గమనార్హం.