23-06-2024 RJ
తెలంగాణ
సూర్యాపేట, జూన్ 23: సూర్యాపేట జిల్లా పట్టణానికి సమీపంలో ఉన్న దూరజ్ పల్లి వద్ద అగ్ని ప్రమాదం జరిగి జయశంకర్ పాలిమర్స్ ప్లాస్టిక్ గ్లాస్ ల తయారీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ గోదాంలో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 టన్నుల విలువైన సామాగ్రి ఉండగా తయారీ మిషన్లు మొత్తం పూర్తిగా కాలిపోయాయని సుమారు రూ.కోటిన్నర విలువైన ఆస్తి నష్టం అయిందని యజమాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి గోదాం పూర్తిగా దగ్ధం అయింది. ఘటనా స్థలానికి చేరుకొన్న2 ఫైర్ ఇంజిన్లు మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.