24-06-2024 RJ
ఆంధ్రప్రదేశ్
న్యూఢిల్లీ, జూన్ 24: పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పార్లమెంట్‌కు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అప్పలనాయుడు అడుగుపెట్టారు. ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై చేరుకున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు 15 లక్షల 68 వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఓ సాధారణ వ్యక్తిలా ఇలా సైకిల్‌పై లోక్‌సభకు చేరుకున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు. సవిూప వైసీపీ అభ్యర్థిపై 2 లక్షల 29 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.