24-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 24: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది.చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను నియమించడంతో పాటు.. హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్‌క్రాప్ట్స్ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు.
అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించడంతో పాటు టీపీటీఆర్‌ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్‌ను విద్యుత్ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయనకు జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఇక పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీదేవసేనను కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, అటవీ, పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శిగా అహ్మద్ నదీమ్ నియమించారు. ఆయనకు టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా ఉన్న రిజ్వీని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డిని నియమించారు. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు.